top of page

హాట్ టాపిక్‌గా మారిన విజయ్‌ దేవరకొండ సోషల్ మీడియా పోస్ట్..🌟🤝

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' చిత్రం విడుదలకు సిద్ధమయింది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.తాజాగా అర్ధరాత్రి పూట సమంతకు ఆయన చేసిన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ree

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' చిత్రం విడుదలకు సిద్ధమయింది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.తాజాగా అర్ధరాత్రి పూట సమంతకు ఆయన చేసిన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు మరో పోస్టింగ్ తో అభిమానుల్లో ఉత్సుకతను పెంచాడు . ఒక అమ్మాయి చేతిలో చెయ్యి వేసిన ఫొటోను విజయ్ షేర్ చేశాడు. దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు. 'ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇది నిజంగా ప్రత్యేకం. త్వరలోనే చెపుతా' అని రాశాడు. ఆ రెండో చెయ్యి ఎవరిది అనే సస్పెన్స్ ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది. విజయ్ ప్రేమించిన అమ్మాయిదే అయి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొందరేమో అది రష్మిక మందన్న చెయ్యి అని ఫిక్స్ అవుతున్నారు. విజయ్ ఏదో సీక్రెట్ మ్యాటర్ చెప్పబోతున్నాడని మరి కొందరు అంటున్నారు. విషయం ఏమిటనేది అర్థం కావాలంటే విజయ్ చెప్పేంత వరకు ఆగాల్సిందే.👥


 
 
bottom of page