top of page

మరోసారి థియేటర్లలోకి ‘నువ్వే కావాలి’..

ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన చిత్రాలనే ఇప్పుడు 4కే వెర్షన్ తో రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు మరోసారి భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. గుడుంబా శంకర్, పోకిరి, బిల్లా, ఆరెంజ్ వంటి చిత్రాలకు కలెక్షన్స్ ఏ స్థాయిలో వచ్చాయో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు మరో కల్ట్ క్లాసిక్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది.

ree

ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన చిత్రాలనే ఇప్పుడు 4కే వెర్షన్ తో రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు మరోసారి భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. గుడుంబా శంకర్, పోకిరి, బిల్లా, ఆరెంజ్ వంటి చిత్రాలకు కలెక్షన్స్ ఏ స్థాయిలో వచ్చాయో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు మరో కల్ట్ క్లాసిక్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే ‘నువ్వే కావాలి’. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తరుణ్ నటించిన వన్ ఆఫ్ ది లవ్ స్టోరీ ‘నువ్వే కావాలి’. డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ, మాటలు అందించారు.ఇక ఈ సినిమాలో రిచా పల్లాడ్ కథానాయికగా నటించి మెప్పించింది. ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్ పై రామోజీ రావు, స్రవంతి రవి కిషోర్ నిర్మించగా.. 2000లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీకి వచ్చిన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి అందించిన మ్యూజిక్ ఎవర్ గ్రీన్ హిట్. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాను 4కే వెర్షన్లో అడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నామంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే డేట్ ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు.


 
 
bottom of page