top of page

సైంటిఫిక్‌ కామెడీగా వస్తున్న ‘ప్లాంట్‌ మ్యాన్‌’ ఫస్ట్‌లుక్‌..🎥🎞️

ఇప్పటి వరకు మనం చూడని కొత్త తరహా కామెడీ మూవీ ఇది. సైంటిఫిక్‌ కామెడీ ఎక్స్‌పెరిమెంట్‌గా వస్తున్న ప్లాంట్‌ మ్యాన్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ మూవీ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు.

ree

కాలింగ్‌ బెల్‌, రాక్షసి వంటి హారర్‌ మూవీస్‌తో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన డైరెక్టర్‌ పన్నా రాయల్‌ ఇప్పుడు ఇంటి నెం.13 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌ కాబోతోంది. ఇదిలా ఉంటే, పన్నా రాయల్‌ డిఎం యూనివర్సల్‌ స్టూడియోస్‌ అనే బేనర్‌ను స్థాపించారు. అందులో భాగంగానే తనే నిర్మాతగా మారి డిఎం యూనివర్సల్‌ స్టూడియోస్‌ పతాకంపై ‘ప్లాంట్‌ మ్యాన్‌’ అనే సినిమాను నిర్మిస్తున్నారు . ఈ సినిమా ద్వారా కె.సంతోష్‌బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పన్నా రాయల్‌ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపొందుతోంది.ఇప్పటి వరకు మనం చూడని కొత్త తరహా కామెడీ మూవీ ఇది. సైంటిఫిక్‌ కామెడీ ఎక్స్‌పెరిమెంట్‌గా వస్తున్న ప్లాంట్‌ మ్యాన్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ మూవీ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. తమ బేనర్‌లో కొత్తవారికి అవకాశం ఇచ్చి చిన్న సినిమాలు నిర్మిస్తామని నిర్మాత పన్నా రాయల్‌ తెలిపారు.🎥


 
 
bottom of page