మొత్తానికి వీళ్లిద్దరి మధ్యే కుదిరిందిగా… 🌟
- Shiva YT
- Feb 20, 2024
- 1 min read
మొత్తానికి అందరూ అనుకున్నదే నిజం అయింది. శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్.. చిరు సన్ మెగా పవర్ రామ్ చరణ్ కు జోడీగా సెట్ అయింది. ఇద్దరి కలయిక సిల్వర్ స్క్రీన్ కుదిరింది. ఇదే ఇప్పుడు అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు బాలీవుడ్.. టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లోకి దేవర మూవీతో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన జాన్వీ కపూర్.. నెక్ట్స్ రామ్ చరణ్ ఆర్సీ 16లో నటిస్తోందట. ఇదే విషయం ఇప్పటి వరకు అఫీషియల్ గా తెలియకపోయినా.. జాన్వీ ఫాదర్ బోనీ కపూర్ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో లీక్ చేశారు. 🎬












































