top of page

🌌🚀 వావ్! వజ్రమా.. భూమా ?? నోవా-సి అద్భుత చిత్రాలు 🌍🛰️

చంద్రుడిపైకి అమెరికా పంపించిన తొలి ప్రైవేట్ ల్యాండర్ ‘నోవా-సి’ ప్రస్తుతం మార్గమధ్యంలో ఉంది. ఫిబ్రవరి 15న కేప్ కానవెరాల్ లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్లు ఈ ల్యాండర్ ను అంతరిక్షంలోకి చేర్చాయి. అటుపై ల్యాండర్ చంద్రుడివైపు దూసుకెళుతోంది.

ప్రయాణంలో ఈ ల్యాండర్ తీసి పంపిన ఫొటోలను అమెరికా కంపెనీ ఇనిషియేటివ్ మెషిన్ IM తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భూమి వజ్రపు తునకలా మెరిసిపోతూ కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందనేది గతంలో చాలా ఫొటోలు చూసినా నోవా- సి పంపిన ఫొటోలు అద్భుతంగా ఉన్నాయిని మెచ్చుకుంటున్నారు 📸✨


 
 
bottom of page