top of page

🌱🤔 వేగంగా జుట్టు రాలుతోందా..?

🔍🤷 సాధారణంగా జుట్టు రాలడాన్ని స్కాల్ప్ సమస్యగా భావిస్తారు. అయితే దీనికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. జుట్టురాలడానికి శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. లూపస్, సిఫిలిస్, థైరాయిడ్, సెక్స్-హార్మోన్ అసమతుల్యత, పోషకాహార సమస్యల వల్ల కూడా జుట్టు వేగంగా రాలుతుంది. అంతేకాకుండా ప్రోటీన్, ఐరన్, జింక్ లోపం కూడా జుట్టుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

ree

🔄🧠 ఇక ఒత్తిడి లేదా డిప్రెషన్‌లో ఉన్నవారికి కూడా జుట్టు సమస్యలు ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. అలాంటి వారిలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు, ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ విడుదల అవుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన మూలకణాలను దెబ్బతీస్తుంది. దీని వల్ల వెంట్రుకలు బలహీనంగా మారడంతోపాటు విరిగిపోయే ప్రమాదం ఉంది.

💉🤷‍♂️ థైరాయిడ్‌తో బాధపడేవారిలో కూడా వెంట్రుకలు చిట్లడం, రాలడం వంటి సమస్యలు కనిపిస్తాయి. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం రెండింటిలోనూ జుట్టు రాలే సమస్య కావచ్చు . హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న 50% మంది రోగులలో, హైపోథైరాయిడిజం రోగులలో 33% మందిలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే జుట్టు రాలిపోతుంటే థైరాయిడ్‌ని చెక్ చేసుకోవాలి.

🥗🌿 జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అవసరం. రిబోఫ్లావిన్, బయోటిన్, ఫోలేట్, విటమిన్ బి12, విటమిన్-ఈలలో లోపాలు జుట్టు రాలడానికి కారణంగా మారుతాయి. ఆహారంలో జింక్, ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల జుట్టు కూడా ప్రభావితమవుతుంది. అటువంటి పరిస్థితిలో, జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 
 
bottom of page