‘యాపిల్ ఈవీ కారు రిలీజ్ ఎప్పుడంటే..?’
- Shiva YT
- Jan 25, 2024
- 1 min read
‘ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలు దుమ్మురేపుతున్నాయి. ప్రజల నుంచి అనూహ్య డిమాండ్ రావడంతో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల ఈవీ రంగంలో తమ పెట్టుబడులను విస్తరిస్తున్నాయి. 🌍
ఇటీవల కాలంలో టాప్ టెక్ కంపెనీ అయిన యాపిల్ కూడా ఈవీ రంగంలోకి అడుగుపెట్టాలని ఎదురు చూస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 🚗 ప్రాజెక్ట్ టైటాన్ పేరుతో యాపిల్ ఈవీ వాహన రంగంలోకి అడుగుపెట్టనుంది. అయితే యాపిల్ టైటాన్‌కు సంబంధించిన ఈవీ కారు 2028లో విడుదల అవుతుందని వార్తలు వెలువడుతున్నాయి. 2015లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అనేక అవాంతరాలు, కార్యనిర్వాహక టర్నోవర్ సమస్యలను ఎదుర్కొంది. 🚘 ముఖ్యంగా స్టీరింగ్ వీల్ లేని ఆటోమెటిక్ వాహనం రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 🤖 అయితే యాపిల్ కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. యాపిల్ వైస్ ప్రెసిడెంట్ కెవిన్ లించ్ 2021 నుంచి ప్రాజెక్ట్ టైటాన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. అతని మార్గదర్శకత్వంలో, కంపెనీ ఎలక్ట్రిక్ వాహనం కోసం దాని దృష్టిని సర్దుబాటు చేసింది. డ్రైవర్ ప్రమేయం లేకుండా పూర్తిగా ఆటోమెటిక్ కారు కోసం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను కంపెనీల తగ్గించింది. 2028 ఆపిల్ కారు ఇతర ఎలక్ట్రిక్ వాహనాలతో అంటే ముఖ్యంగా టెస్లాలో ఉన్నటువంటి పరిమిత స్వయంప్రతిపత్తి లక్షణాలను అందిస్తుందని భావిస్తున్నారు. 🌐 సవరించిన ప్రణాళిక ఆపిల్ కారును లెవెల్ 2 ప్లస్ సిస్టమ్‌గా ఉంచింది. టెస్లాకు ఆటోపైలట్ సిస్టమ్‌ను పోలి ఉండేలా డ్రైవర్లు శ్రద్ధగా, నియంత్రణకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. 🚀