‘ఓటీటీలోకి వచ్చేసిన లిటిల్ మిస్ నైనా.. ఎందులోనంటే?’ 🎬
- Shiva YT
- Jan 25, 2024
- 1 min read
‘తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 96 సినిమాతో బాగా ఫేమస్ అయిపోయింది గౌరీ కిషన్. 🌟 ఇందులో త్రిష చిన్ననాటి ప్రేమకథా సన్నివేశాల్లో ఎంతో అద్భుతంగా నటించింది. 96 తెలుగు వెర్షన్ జానులోనూ గౌరీ కిషన్ నటించి మెప్పించింది. 🎭
ఇక గతేడాది మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించిన శ్రీదేవి శోభన్ బాబు మూవీతో హీరోయిన్‌గా కూడా పరిచయమైందీ అందాల తార. 👩🎤 సంతోష్ శోభన్ హీరో. ఇందులో గౌరి కిషన్ అందం, అభినయానికి మంచి పేరొచ్చింది. 🌟 అయితే సినిమా సక్సెస్ కాకపోవడంతో రేస్‌లో కాస్త వెనకబడింది గౌరి కిషన్. ఇదిలా ఉంటే మలయాళంలో గౌరీ జి కిషన్ నటించిన లేటెస్ట్‌సినిమా లిటిల్ మిస్ రాథర్’. షేర్షా షరీఫ్ హీరోగా నటించాడు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. 🌈 రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ ప్రేమకథ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లిటిల్ మిస్ నైనా పేరుతో నేరుగా ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 📺🎉