కంగువ నుంచి క్రేజీ అప్డేట్.. సూర్య ఫొటోలతో గుడ్ న్యూస్ చెప్పిన టీమ్🎥🤩
- Suresh D
- Feb 22, 2024
- 2 min read
తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ సినిమా కంగువ నుంచి అప్డేట్ వచ్చింది. కంగువ డబ్బింగ్ పనులను సినిమా టీమ్ ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా మూవీ టీమ్ ట్విటర్ వేదికగా ఫొటోలు షేర్ చేసింది.🎥🤩
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటానీ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే 'కంగువ'లో యానిమల్ విలన్ బాబీ డియోల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.
ఇప్పటికే కంగువ మూవీ టీజర్ లుక్స్, పోస్టర్స్ తెగ ఆసక్తిరేకెత్తించాయి. దాంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. తాజాగా 'కంగువ' సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు హీరో సూర్య. డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోస్‌లో హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ ఫొటో తీసుకున్నారు. దీంతో కంగువ మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం అయినట్లు లేటెస్ట్ ఫొటోలతో మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
కంగువ సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. 'కంగువ'లో వరల్డ్ క్లాస్ మేకింగ్, సూర్య పెర్ఫార్మెన్స్ హైలైట్ కానుందని మేకర్స్ చెబుతున్నారు. హీరో సూర్య కెరీర్‌లో హై బడ్జెట్ మూవీగా రూపొందుతున్న 'కంగువ' ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్పెషల్ ఫిల్మ్ కాబోతోంది. త్వరలోనే కంగువ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. త్రీడీలోనూ 'కంగువ' ప్రేక్షకుల ముందుకు రానుంది.
కంగువ మూవీలో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్‌తో పాటు కమెడియన్ యోగి బాబు కూడా నటిస్తున్నారు. సినిమాకు వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు చేపట్టగా.. సుప్రీమ్ సుందర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అంతేకాకుండా కంగువ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్‌గా నిశాద్ యూసుఫ్ చేస్తే.. సినిమాకు కథను శివ, ఆది నారాయణ అందించారు. మదన్ కార్కే డైలాగ్స్, వివేక్, మదన్ కార్కె పాటలు అందిస్తున్నారు.
కేఈ జ్ఞానవేల్ రాజ, వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న కంగువ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఏజే రాజా, కో ప్రొడ్యూసర్‌గా నేహా జ్ఞానవేల్ రాజా ఉన్నారు. ఇక కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి అనే అర్థం వస్తుంది. అంటే సాటిలేని పరాక్రమవంతుడు అని మీనింగ్. 14వ శతాబ్ధం నేపథ్యంలో కంగువ అనే యుద్ధ వీరుడి కల్పిత కథను చెప్పనున్నారు. దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో సూర్య ఒకేసారి ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని టాక్.🎥🤩








































