top of page

మూడుముళ్ల బంధంతో ఒక్కటైన రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ! 👩‍❤️‍💋‍👨💖

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట ఫైనల్లీ ఒక్కటయ్యారు. గోవాలో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు వీరి వివాహానికి తరలి వెళ్లారు.



స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ఆమె పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లుగా ప్రేమ బంధంలో ఉన్న వీరు ఇప్పుడు దంపతులు అయ్యారు. రకుల్ - జాకీ వివాహం నిన్న (ఫిబ్రవరి 21) గోవాలో గ్రాండ్‍గా జరిగింది. 

దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రుకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక వైభవంగా జరిగింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానీ, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‍తో పాటు మరికొందరు సినీ సెలెబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు. రకుల్, జాకీ కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు వచ్చారు.

రెండు సంప్రదాయాల్లో..

పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో రకుల్ - జాకీ వివాహం జరిగిందని తెలుస్తోంది. ఇరు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుక జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి రావాల్సి ఉంది. వీరి పెళ్లి ఫొటోల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రుకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ పెళ్లి వేడుకలు గోవాలోని ఐటీసీ గ్రాండ్‍లో ఫిబ్రవరి 19వ తేదీనే మొదలయ్యాయి. పెళ్లికి ముందు జరిగే పార్టీలు, ఫంక్షన్లు గ్రాండ్‍గా చేసుకున్నారు. మంగళవారం సంగీత్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో శిల్పా శెట్టి డ్యాన్స్ హైలైట్‍గా నిలిచిందని తెలుస్తోంది. ఇక నిన్న రకుల్ - జాకీ వివాహ బంధంతో ఒకటయ్యారు.

రుకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఇద్దరూ ఆ తర్వాత ప్రేమికులయ్యారు. తాము ప్రేమలో ఉన్నామని 2021 అక్టోబర్‌లో వారిద్దరూ ప్రకటించారు. రకుల్ పుట్టిన రోజునే ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత జంటగానే చాలా ఫంక్షన్‍లకు కూడా హాజరయ్యారు.👩‍❤️‍💋‍👨💖 

 
 
bottom of page