top of page

🌟🎥 సొంతూరులో ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ. 🌟🎥

గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెంలో మొదటిసారి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ జరిగింది. బుర్రిపాలెం బుల్లోడుగా కృష్ణకు పేరుంది.

గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెంలో మొదటిసారి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ జరిగింది. బుర్రిపాలెం బుల్లోడుగా కృష్ణకు పేరుంది. గత ఏడాది నవంబర్ 15 తేదిన ఆయన చనిపోయిన తర్వాత స్వంత ఊర్లో విగ్రహావిష్కరణ చేయాలని అభిమానులు భావించారు. మేలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేశారు. అయితే అనివార్య కారణాలతో విగ్రహావిష్కరణ సాధ్యం కాలేదు. 🙏🏻 విగ్రహావిష్కరణ జాప్యం అవుతుండటంతో కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు అభిమాన సంఘాలతో మాట్లాడి ఈ రోజు విగ్రహాష్కరణ ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణకు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు కృష్ణ కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. 🤝🏼


 
 
bottom of page