నథింగ్ ఫోన్-2పై ప్రత్యేక తగ్గింపు..
- Suresh D
- Aug 7, 2023
- 1 min read
ప్రస్తుతం భారతదేశంలో ఇండిపెండెన్స్ సేల్ ఫీవర్ నడుస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ల నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్ వరకూ ప్రతి ఒక్కరూ వినియోగదారులను ఆకర్షించడానికి ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తున్నాయి.

ప్రస్తుతం భారతదేశంలో ఇండిపెండెన్స్ సేల్ ఫీవర్ నడుస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ల నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్ వరకూ ప్రతి ఒక్కరూ వినియోగదారులను ఆకర్షించడానికి ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తున్నాయి. అయితే భారతదేశంలో ప్రారంభం నుంచి ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న నథింగ్ కంపెనీలు ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఇస్తుంది. ముఖ్యంగా కంపెనీ ఇటీవల రిలీజ్ చేసిన నథింగ్-2 ఫోన్‌పై రూ.7000 తగ్గింపునిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ ఆఫర్ ఎలా పొందాలో ఓ సారి తెలుసుకుందాం. ఈ ఏడాది జూలైలో ₹ 44,999 ప్రారంభ ధరతో ప్రారంభించబడిన నథింగ్ ఫోన్ (2) విక్రయ ఆఫర్ సమయంలో మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 వరకూ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఈ ఫోన కొనుగోలు చేయడానికి ఏదైనా ఇతర ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.4000 వరకూ అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇలా నథింగ్ (2)పై రూ.7000 తగ్గింపును పొందవచ్చు.