'సలార్' ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా.?🌟🎥
- Suresh D
- Aug 7, 2023
- 1 min read
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'సలార్'. ఇది రెండు పార్టులగా రాబోతుంది. మెుదటి భాగానికి అని టైటిల్ పెట్టారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'సలార్'. ఇది రెండు పార్టులగా రాబోతుంది. మెుదటి భాగానికి అని టైటిల్ పెట్టారు. ఇప్పటికే టీజర్ ను విడుదల చేసి డార్లింగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు మేకర్స్. తాజాగా దీనికి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సలార్ సీజ్ ఫైర్ ఫస్ట్ సింగిల్‌ను స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న సలార్‌లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై వీరలెవల్లో అంచనాలను పెంచేశాయి. సలార్ పార్ట్-1 ను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 28న రిలీజ్ చేయనున్నారు. 🌟🎥