చిచ్చు పెట్టిన కుటుంబ నియంత్రణ ‘సర్కారు నౌకరి’🎥🌟
- Suresh D
- Dec 20, 2023
- 1 min read
గాయని సునీత వారసుడు ఆకాష్ గోపరాజు నటుడిగా పరిచయమవుతున్న సినిమా సర్కారు నౌకరి. దీంతో పాటు మరో విశేషం ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దీనికి నిర్మాతగా వ్యవహరించడం. సలార్ వచ్చిన వారానికే నూతన సంవత్సర కానుకగా జనవరి 1 విడుదల చేయబోతున్నారు. శేఖర్ గంగనమోని దర్శకుడు. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు. బలగం నుంచి చిన్న సినిమాలు సైతం థియేట్రికల్ రిలీజ్ చేసుకుని అద్భుతాలు చేయొచ్చని ఋజువయ్యాక అందరూ అదే బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు నౌకరి కూడా అలాంటి జానరే అనిపిస్తోంది. 🎥🌟