న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. తాగి పట్టుబడితే ఇక అంతే.. 🚔👀
- Suresh D
- Dec 20, 2023
- 1 min read
న్యూఇయర్ వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోటళ్లు, పబ్ లు, ఈవెంట్లకు 31 అర్ధరాత్రి 1గంట వరకే అనుమతి ఉంటుందని హైదరాబాద్ సీపీ కె. శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
న్యూఇయర్ వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోటళ్లు, పబ్ లు, ఈవెంట్లకు 31 అర్ధరాత్రి 1గంట వరకే అనుమతి ఉంటుందని హైదరాబాద్ సీపీ కె. శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ గంజాయ్ వాటితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ముందుగా ఈవెంట్ లు నిర్వహించే హోటళ్లు, పబ్బుల యజమానులు 10 రోజుల ముందే అనుమతి తీసుకోవాలన్నారు. లిక్కర్ సరఫరాకు కూడా అనుమతి తీసుకోవాలన్నారు. పబ్బులల్లో అశ్లీల నృత్యాలు చేస్తే సహించేది లేదన్నారు. కెపాసిటీకి మించి అనుమతించవద్దని.. పబ్బుల వద్ద సెక్యూరిటీ గార్డులను ఎక్కువగా నియమించుకోవాలని సూచించారు.🚫🎵
అంతేకాకుండా తాగి వాహనాలు నడిపితే.. కఠిన చర్యలు తప్పవన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే.. 10వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని సీపీ తెలిపారు.🚔👀