top of page

‘నా జీవితంలోనూ బ్రేకప్’.. సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..!


ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్.. తన జీవితంలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా “ఎవరో అంటున్నారు కదా అని పెళ్లి ఇప్పుడే చేసుకోను. నాకు నచ్చినప్పుడే నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను” అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తన జీవితంలో కూడా లవ్ బ్రేకప్ జరిగిందని.. తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, ప్రేమించిన తరువాత విడిపోయామని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత అమ్మాయిలు అంటేనే భయం వేస్తుందని.. బ్రేకప్ తరువాత చాలా సైంటెట్ అయినట్టు వెల్లడించారు. ప్రధానంగా ప్రతీ మనిషికి ఓ లైఫ్ జర్నీ ఉంటుందని, అందులో పడటం, లేవడం అనేది సర్వసాధారణమని తెలిపారు. అలాగే సాయిధరమ్ తేజ్ లైఫ్ కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సమయంలో దేవుడు యాక్సిడెంట్ రూపంలో చిన్న బ్రేక్ వేశాడు.


అయితే తాను దాంట్లో నుంచి రికవర్ అయి చేస్తున్న ఫస్ట్ సినిమా విరూపాక్ష. ఈ చిత్రానికి కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page