top of page

రిషబ్ శెట్టి 'కాంతారా: చాప్టర్ 1' కోసం ఆడిషన్ కాల్‌ని ప్రకటించారు🎥🎭

పస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా కోసం కొత్త నటీనటులను తీసుకోవాలని భావిస్తున్నారు మేకర్స్.

ree

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా కాంతార. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ.450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ప్రీక్వెల్ కూడా ప్రకటించారు మేకర్స్. కాంతారా 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల విడుదలైన కాంతార 2 టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.

పస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా కోసం కొత్త నటీనటులను తీసుకోవాలని భావిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమాకు అడిషన్స్ నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆసక్తి ఉన్నవారికి లక్కీ ఛాన్స్ ఇచ్చారు. కాంతార ప్రీక్వెల్ సినిమాకు దాదాపు 30 నుంచి 60 ఏళ్లు మగవారు.. 18 నుంచి 60 ఏళ్లు ఉన్న ఆడవారు కావాలని.. ఆసక్తి ఉన్నారు. https://www.kantara.film అనే సైట్ లోకి వెళ్లి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో చేసే రీల్స్, టిక్ టాక్ వీడియోస్ చేయొద్దని తెలిపారు.🎥🎭

ree

 
 
bottom of page