📽️🎉ఓటీటీలోకి వచ్చేసిన ‘లియో’ ఇంగ్లీష్ వెర్షన్.. 🎬
- Suresh D
- Dec 12, 2023
- 1 min read
దళపతి విజయ్ లియో మూవీని ఓటీటీలో తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇకపై ఇంగ్లీష్‌లోనూ చూడొచ్చు. లియో ఇంగ్లీష్ వెర్షన్ మంగళవారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.
దళపతి విజయ్ లియో మూవీని ఓటీటీలో తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇకపై ఇంగ్లీష్‌లోనూ చూడొచ్చు. లియో ఇంగ్లీష్ వెర్షన్ మంగళవారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.తొలుత దక్షిణాది, హిందీ భాషలతో పాటు ఇంగ్లీషలోనూ ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావించింది. కానీ ఇంగ్లీష్ వెర్షన్ డబ్బింగ్ పనులు ఆలస్యం కావడంతో ఓటీటీ రిలీజ్ వాయిదాపడింది. తాజాగా రెండు వారాలు ఆలస్యంగా మంగళవారం ఇంగ్లీష్ వెర్షన్‌ను ఓటీటీలోకి తీసుకొచ్చారు.
ఓవర్‌సీస్‌తో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ డిమాండ్ మేరకే లియో సినిమా ఇంగ్లీష్ వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేసినట్లు సమాచారం. కాంతార తర్వాత ఓటీటీలో ఇంగ్లీష్‌లో రిలీజైన దక్షిణాది మూవీగా లియో నిలిచింది. కాంతార ఇంగ్లీష్ వెర్షన్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే అందుబాటులో ఉండటం గమనార్హం.
లియో మూవీకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 600 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. దళపతి విజయ్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
లియో సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా... సంజయ్ దత్, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్ మూవీ ఏ హిస్టరీ ఆఫ్ వయోలెన్స్ ఆధారంగా లియో మూవీ తెరకెక్కినట్లు ప్రచారం జరిగింది. విజయ్ హీరోయిజం, క్యారెక్టరైజేషన్ బాగుందనే పేరొచ్చిన కథ, కథనాలపై విమర్శలొచ్చాయి. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా తమిళంతో పాటు తెలుగు భాషాల్లో భాక్సాఫీస్ వద్ద లియో కాసుల వర్షాన్ని కురిపించింది. 🌟🎬💰












































