ప్రభాస్ 'సాలార్' ప్రశాంత్ నీల్ 'ఉగ్రం'కి రీమేక్? క్లారిటీ ఇచ్చిన మూవీ ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్🌟
- Suresh D
- Dec 12, 2023
- 1 min read
సలార్ మూవీ ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్.. ప్రభాస్ వరుస ఫ్లాపులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు సలార్ మూవీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించాడు.🌟🎬
ప్రస్తుతం దేశమే కాదు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా సలార్: పార్ట్ 1 సీజ్‌ఫైర్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తుందని ట్రేడ్ పండితులు కూడా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సలార్ మూవీ ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్ బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రభాస్ వరుస ఫ్లాపులు, సలార్ ఒరిజినల్ స్టోరీయా లేక రీమేకా? సలార్ 2 ముందు వస్తుందా లేక కేజీఎఫ్ 3 వస్తుందా? కాంతారా ప్రీక్వెల్ రిలీజ్ ఎప్పుడు? సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి వంటి అంశాలపై ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్ స్పందించాడు.
సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. అయితే అంతకుముందు రోజే షారుక్ ఖాన్ డంకీతోపాటు హాలీవుడ్ మూవీ ఆక్వామాన్ కూడా రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో సలార్ ను అదే రోజు ఎందుకు రిలీజ్ చేయబోతున్నారని ప్రశ్నించగా.. తాము ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక జ్యోతిష్య కారణాలు ఉన్నట్లు చెప్పాడు. గత పది పన్నేండేళ్లుగా ఇలాగే తమ సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తామని తెలిపాడు. అందుకే డంకీ, ఆక్వామాన్ రిలీజ్ అవుతున్నా.. తాము వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశాడు.
ఇక సలార్ మూవీ ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం రీమేక్ అన్న వార్తలపైనా విజయ్ కిరగండూర్ స్పందించాడు. ఉగ్రం, కేజీఎఫ్ రెండు సినిమాలు చేసిన ప్రశాంత్ నీల్ ప్రతిసారీ ఓ కొత్త సబ్జెక్ట్ తో ఎలా ప్రేక్షకుల ముందుకు రావాలో తెలుసని, ఈ వార్తల్లో అసలు నిజం లేదని కొట్టి పారేశాడు. ఇక సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో డిసెంబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు కూడా తెలిపాడు.🌟🎬












































