ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ హై ఓల్టేజ్ మ్యాచ్..
- Suresh D
- Mar 29, 2024
- 1 min read
IPL 2024: 10వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ (RCB vs KKR) జట్లు తలపడుతున్నాయి . చివరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందగా, కేకేఆర్ నాలుగు పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. అయినప్పటికీ, రెండు జట్ల టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సమస్యలు అలాగే ఉన్నాయి. అయితే బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తమ పాత తప్పిదాలను సరిదిద్దుకుని బరిలోకి దిగాలని పట్టుదలతో ఉన్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం పిచ్ ఫ్లాట్‌గా ఉండి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే కొత్త బంతితో పేసర్లు మరింత లాభపడతారు. అయితే, పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు వచ్చే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియం చిన్నది కాబట్టి బౌండరీలు, సిక్సర్లు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయి. గత మ్యాచ్‌లే ఇందుకు ఉదాహరణ.