పవన్ లెక్క తప్పుతోందా..?
- Suresh D
- Mar 29, 2024
- 1 min read
ఎన్నికల్లో పోటీ చేయడం అంటే డబ్బులతో కూడిన వ్యవహారం అని పవన్ కల్యాణ్‌కు తెలియంది కాదు. ఒకసారి జీరో పాలిటిక్స్ అంటాడు.. మరోసారి నేను ఎప్పుడు జీరో పాలిటిక్స్ గురించి మాట్లాడలేదంటాడు. సొంత క్యాడర్‌పైనే నిందలు వేస్తూ.. మీరు జగన్‌కు ఓటేశాడని విమర్శిస్తాడు. నిత్యం జగన్ మీద తీవ్ర విమర్శలు చేసే పవన్ కల్యాణ్..గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినన్ని స్థానాల్లో కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తొలుత 23 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కల్యాణ్ తరువాత ఆ సంఖ్యను 21కి తగ్గించుకున్నారు. అసలు పవన్ కల్యాణ్ ఎవరి కోసం ఇలా దిగజారిపోతున్నారో పార్టీ క్యాడర్‌కు సైతం అర్థం కావడం లేదు.జగన్ ఓడిపోతే పవన్ కల్యాణ్ సీఎం అవుతారా అంటే అది లేదు. పవన్‌కు సీఎం సీటు షేరింగ్ లేదని టీడీపీ యువనేత నారా లోకేష్ తేల్చి చెప్పారు. అయిన కూడా పవన్ కల్యాణ్ చంద్రబాబు గెలుపు కోసం ఇంతలా ఎందుకు పరితపిస్తున్నారో జనసైనికులకు కూడా అర్థం కావడం లేదు. అసలు రాష్ట్రంలో చనిపోయిందనుకున్న టీడీపీని బ్రతికించి మనం వారి పల్లకిని మోయాల్సిన అసవరం ఏమోచ్చిందని పార్టీ అధినేతను జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.గతంలో పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన నేతలకే టికెట్లు దక్కని పరిస్థితి. పవన్‌ను జనసేన నాయకులే నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారంటూ జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.