top of page

‘టైగర్ నాగేశ్వర రావు’ ఫస్ట్ డే కలెక్షన్స్.. 🌟🎥

స్టార్ హీరో రవితేజ - వంశీ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ మూవీనే 'టైగర్ నాగేశ్వర్రావు'. ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు.

స్టార్ హీరో రవితేజ - వంశీ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ మూవీనే 'టైగర్ నాగేశ్వర్రావు'. ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ 1970 కాలంలో గజగజలాడించిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రేక్షకులు మంచి స్పందనను సైతం అందించారు.

ఈ సినిమాలో రవితేజ ఎంట్రీ సీన్ అదిరిపోయిందని.. ఇక యాక్షన్ సన్నివేశాలు సూపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ వచ్చాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు భారతదేశంలో రూ.8 కోట్ల నికర వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. రవితేజ చివరిసారిగా కనిపించిన రావణాసుర సినిమా తొలిరోజు కలెక్షన్స్ రూ.6 కోట్లు వచ్చాయి. ఇక ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన వాల్తేరు వీర్యయ సినిమా మొదటి రోజే దాదాపు రూ.29.6 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ రెండు చిత్రాలతో.. టైగర్ నాగేశ్వర్ కేవలం భారతదేశంలోనే రూ.8 కోట్లు రాబట్టింది. దసరా పండగ సందర్భంగా ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.🌟🎥

 
 
bottom of page