top of page

‘వార్ 2’ సినిమా ఫోటోస్, వీడియోస్ లీక్.. హాలీవుడ్ మూవీ రేంజ్‏లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఛేజింగ్ సీన్..

వార్ 2 అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు నెట్టింట ఏకంగా ఈ సినిమా షూటింగ్ ఫోటోస్ దర్శనమిచ్చాయి. ఇటీవలే ఈమూవీ షూటింగ్ ప్రారంభం కావడంతో ..సెట్ నుంచి చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్ తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటు దేవర షూటింగ్ లో పాల్గొంటూనే అటు బాలీవుడ్ ఏంట్రీ ఇస్తున్నారు తారక్. ఇప్పుడు ఆయన హిందీలో నటిస్తోన్న సినిమా వార్ 2. YRF స్పై యూనివర్స్ రాబోయే చిత్రాలలో ఈ సినిమా ఒకటి. ఇది 2019 బాలీవుడ్ యాక్షన్-థ్రిల్లర్ చిత్రం ‘వార్’కి సీక్వెల్. ఈ చిత్రం షూటింగ్‌కు ముందు సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఇందులో తారక్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తుండడంతో ఈ మూవీపై మరింత హైప్ నెలకొంది.ఈ క్రమంలోనే వార్ 2 అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు నెట్టింట ఏకంగా ఈ సినిమా షూటింగ్ ఫోటోస్ దర్శనమిచ్చాయి. ఇటీవలే ఈమూవీ షూటింగ్ ప్రారంభం కావడంతో ..సెట్ నుంచి చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వార్ 2 టీమ్ ప్రస్తుతం స్పెయిన్‌లో ఉందని, దర్శకుడు అయాన్ ముఖర్జీ షూటింగ్ కోసం లొకేషన్‌ను సెట్ చేస్తున్నట్లు సమాచారం. కబీర్‌ను తిరిగి చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, సెట్ నుండి వీడియోలు, ఫోటోస్ ఇంటర్నెట్‌లో దావానలంలా వైరల్ అవుతున్నాయి.

తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటో చూస్తుంటే ఇది ఛేజ్ సీక్వెన్స్ లాగా కనిపిస్తోంది. ఒక వీడియోలో, ఒక కారు మరొకదానిని వెంబడించడం చూడవచ్చు, మరికొన్నింటిలో కెమెరాతో కూడిన కార్లు సెట్ వైపు కదులుతున్నట్లు చూడవచ్చు. చిత్రీకరిస్తున్న ఛేజింగ్ సీన్‌లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నారు. ఇక ఇప్పుడు వార్ 2 షూటింగ్ ఫోటోలతో ట్విట్టర్ హోరెత్తిపోతుంది. తాజాగా లీక్ అయిన ఫోటోలలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తన టీంతో ఏ సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో కియారా అద్వానీ, జాన్ అబ్రహం, షబీర్ అహ్లువాలియా తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు.🎞️🎥



 
 
bottom of page