top of page

సెంచరీల మోత మోగించిన వార్నర్, మార్ష్.. పాక్ పై ఆసీస్ ఘన విజయం..🏏🎉

వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా రెండో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 🏏🎉

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీలతో చెలరేగారు. వార్నర్ 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్ లతో 163 పరుగులు చేయగా... బర్త్ డే భాయ్ మార్స్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సులతో 121 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 259 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మార్స్ ఔటైనా తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్ డకౌట్ అయ్యాడు. స్టీవ్ స్మిత్ కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు స్టొయినిస్ పర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో షహీన్ ఆఫ్రిది 5 వికెట్లు తీశాడు. హరీస్‌ రవుఫ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌ పేసర్‌ హరీస్‌ రవుఫ్‌ ఒకే ఓవర్ లో 24 పరుగులు ఇచ్చి ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

అనంతరం ఛేదనను ప్రారంభించిన పాకిస్తాన్ కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. షఫీక్ 64 పరుగులు, ఇమామ్ 70 పరుగులు చేశారు. తొలి వికెట్ కు 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. షఫీక్ ఔటైనా తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎంతోసేపు నిలబడలేదు. కేవలం 18 పరుగుల మాత్రమే చేశాడు. ఇమామ్ ఔటైనా తర్వా క్రీజులోకి వచ్చిన రిజ్వాన్ ఉన్నంత సేపు బ్యాట్ ఝలిపించాడు. 40 బంతుల్లో 46 పరుగుల చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన షకీల్ 30, అహ్మద్ 26 పరుగులు చేశారు. ఆఖర్లో ఒత్తిడి తట్టుకోలేక టెయిలెండర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా నాలుగు వికెట్లు తీశాడు. కమిన్స్, స్టొయినిస్ చెరో రెండు వికెట్లు తీశాడు. 🏏🎉

 
 
bottom of page