ఈ రేంజ్‌లో మహేష్ బాబుని చూపిస్తే పండుగే..🎥✨
- Suresh D
- Mar 11, 2024
- 1 min read
ఇక ఈ మూవీ ఈ ఏడాది ప్రథమార్దంలోనే షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇకపై మూడేళ్లు మహేష్ బాబు బయటకు కనిపించొద్దని, యాడ్స్ వంటి వాటిని కూడా చేయొద్దని రాజమౌళి కండీషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ మూవీ ఈ ఏడాది ప్రథమార్దంలోనే షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇకపై మూడేళ్లు మహేష్ బాబు బయటకు కనిపించొద్దని, యాడ్స్ వంటి వాటిని కూడా చేయొద్దని రాజమౌళి కండీషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇలా దొరికిన ఈ కాస్త టైంలోనే యాడ్స్ చేసేసుకుంటున్నాడనిపిస్తోంది.మామూలుగానే మహేష్ బాబు యాడ్స్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, అడ్వెంచర్‌లతో ఫుల్ ఎంగేజింగ్‌గా ఉంటాయి. థమ్స్ అప్, మౌంటెన్ డ్యూ ఇలా చాలా వాటికి మహేష్ బాబు చేసిన యాడ్స్ బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా చేసిన యాడ్, అందులోని మహేష్ బాబు లుక్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదే స్టైల్లో రాజమౌళి సినిమా కూడా ఉంటే అదిరిపోతుందని అనుకుంటన్నారు.🎥✨