రూ.75కే సినిమాలు చూడొచ్చు! ఎలా ? 🎬
- Suresh D
- Mar 11, 2024
- 1 min read
ఇప్పటిదాకా ప్రైవేటు సంస్థలు మాత్రమే ఈ సర్వీస్‌లను అందిస్తున్నాయి. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఓటీటీ సర్వీసులను అందించనుండటం విశేషం.
ప్రస్తుతం నడుస్తున్నది టెక్నాలజీ యుగం. ముఖ్యంగా ఓటీటీ మార్కెట్‌కు ఇప్పుడు సూపర్ క్రేజ్. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ మార్కెట్ విస్తరిస్తోంది. అయితే.. ఇప్పటిదాకా ప్రైవేటు సంస్థలు మాత్రమే ఈ సర్వీస్‌లను అందిస్తున్నాయి. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఓటీటీ సర్వీసులను అందించనుండటం విశేషం. తాజాగా కేరళ ప్రభుత్వం ‘సీస్పేస్’ (CSpace) పేరుతో ఓటీటీ సర్వీస్‌లను అందించనుంది. ఈ క్రమంలో.. కేరళ సీఎం పినరయి విజయన్ గురువారం సీస్పేస్ ప్లాట్‌పామ్‌ను ప్రారంభించారు. దేశంలో తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ వేదిక కావడం విశేషం. ప్రస్తుతం ఓటీటీల్లో ప్రసారమవుతున్న కంటెంట్‌ను సగం ధరకే వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ‘పే ఫర్ వ్యూ’ ఆధారంగా నిర్మాతలకు చెల్లింపులు చేస్తారు. నూతన దర్శకులు తమ చిత్రాల కోసం సీస్పేస్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. అయితే.. థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే సీస్పేస్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ ఓటీటీ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధిలేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనుండటం గొప్ప విషయం.