‘సలార్’ మళ్లీ వాయిదా పడిందా .. ?🎥📅
- Suresh D
- Sep 1, 2023
- 1 min read
ఈనెల 6న సలార్ ట్రైలర్ రాబోతుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.కానీ ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు షాకిచ్చే న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఈనెల 6న సలార్ ట్రైలర్ రాబోతుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కానీ ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు షాకిచ్చే న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో సలార్ వాయిదా పడనుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కు పోస్ట్ పోన్ అయ్యిందని.. అందుకు కారణం ప్రభాస్ మోకాలి సర్జరీ అంటూ ఇప్పుడు నెట్టింట ప్రచారం నడుస్తోంది. ఇక మరికొందరు మాత్రం ఔట్ పుట్ విషయంలో ప్రశాంత్ నీల్ ఫెర్ఫెక్షన్ కోరుకుంటున్నాడని.. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందని.. అందుకే సలార్ వాయిదా పడనుందని అంటున్నారు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.🎥📅