top of page

వెన్నెల కిషోర్ హీరోగా ‘చారి 111’ మూవీ ..🎬🎥

ప్రముఖ హాస్యనటుడు ‘వెన్నెల’ కిషోర్ కథానాయకుడిగా బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత కీర్తికుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో ‘వెన్నెల’ కిషోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తున్నారు. మురళీ శర్మ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు.🎬🎥



 
 
bottom of page