తెలుగులోకి మలయాళం సూపర్ హిట్ హారర్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..🎥✨
- Suresh D
- Feb 20, 2024
- 1 min read
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటేస్ట్ హిట్ మూవీ టాలీవుడ్ లోకి రాబోతుంది. అదే ‘భ్రమయుగం’. రైటర్ కమ్ డైరెక్టర్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ హారర్ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ప్రస్తుతం ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులోకి డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. కన్నడ, తమిళం, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలను ఇటు తెలుగు అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కాంతార, ట్రూ లవర్, మట్టి కుస్తీ, లియో చిత్రాలు తెలుగులో డబ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటేస్ట్ హిట్ మూవీ టాలీవుడ్ లోకి రాబోతుంది. అదే ‘భ్రమయుగం’. రైటర్ కమ్ డైరెక్టర్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ హారర్ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను నైట్ షిప్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించగా.. పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిన ఈ మూవీలో మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు మమ్ముట్టి.
ఇందులో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ మూవీని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేయనుంది. ఈనెల 23న ఈ సైకలాజికల్ హారర్ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.🎥✨