top of page

ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభం.. భారత్ నుంచి వెళ్ళిన అందాల తార గురించి తెలుసా..? 🌍💃

71వ మిస్ వరల్డ్ ఈవెంట్ ప్రారంభమయ్యింది. ఈ వేడుకలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. 🎉 దాదాపు 28 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. 🇮🇳 మూడు దశాబ్దాల తర్వాత మిస్ వరల్డ్ ఈవెంట్ కోసం భారత్ వేదికగా నిలిచింది.

71వ మిస్ వరల్డ్ ఈవెంట్ ప్రారంభమయ్యింది. ఈ వేడుకలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. 🎉 దాదాపు 28 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. 🇮🇳 మూడు దశాబ్దాల తర్వాత మిస్ వరల్డ్ ఈవెంట్ కోసం భారత్ వేదికగా నిలిచింది. 🎊 న్యూఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 🎈 మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఈ వేడుకల గురించి సంతోషం వ్యక్తం చేసింది. 😊 ప్రపంచం భారతదేశంతో పరిచయం పొందడానికి.. అలాగే భారత్ అందిస్తున్న ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఇది అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. 🙏 మిస్ వరల్డ్ ఓపెనింగ్ వేడుక ఈరోజు సాయంత్రం (ఫిబ్రవరి 20)న missworld.comలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. 📺 మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 71వ మిస్ వరల్డ్ గ్లోబల్ ఫినాలే జరుగుతుంది. 💃 ఈ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి 120 మంది పోటీదారులు పాల్గొననున్నారు. 🌏 ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అద్భుతమైన ఈవెంట్‌తో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ముగుస్తుంది. 🎊

ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ITDC) 71వ మిస్ వరల్డ్ ఈవెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని ది ఆషిక్‌లో ‘ది ఓపెనింగ్ సెర్మనీ’, ‘ఇండియా వెల్‌కస్ ది వరల్డ్ గాలా’ని నిర్వహించనుంది. 👗 ఫ్యాషన్ డిజైనర్ అర్చన కొచ్చర్ 71వ మిస్ వరల్డ్ పోటీకి అధికారిక ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్నారు. 👠 ఈఏడాది మిస్ వరల్డ్ పోటీలకు భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) పాల్గొననుంది. 💄 ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లింది సినీ శెట్టి. “నువ్వే నా లక్ష్యం, నువ్వే నా గుర్తు. ఈ ప్రయాణంలో ఈరోజు నేను నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నాను. నా దేశపు త్రివర్ణ పతాకాన్ని చేతిలోనే కాదు.. గుండెల్లో పెట్టుకున్నాను ” అంటూ జాతిని ఉద్దేశించి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 🇮🇳

సినీ శెట్టి స్వస్తలం కర్ణాటకలోని ఉడిపి. ఆమె అకౌంటింగ్, ఫైనాన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. 💼 అలాగే ఆమె భారతనాట్యంలో శిక్షణ తీసుకుంది. 💃 ప్రస్తుతం ఆమె మార్కెటింగ్ లో ఉద్యోగం చేస్తుంది. 💼 దాదాపు 28 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదిక కావడం పట్ల సినీ శెట్టి హర్షం వ్యక్తం చేసింది. 🎉

 
 
bottom of page