‘ఓ మై గాడ్ 2’ సెన్సార్ కట్ లేకుండా చూడాలంటు టీమ్..🎥🎞️
- Suresh D
- Aug 26, 2023
- 1 min read
చాలా కాలం తరువాత ఓ మై గాడ్ 2 సినిమాలో సూపర్ హిట్ అందుకున్నారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించినా, మేకర్స్ ఏదో వెలితిగానే ఫీల్ అవుతున్నారు.

చాలా కాలం తరువాత ఓ మై గాడ్ 2 సినిమాలో సూపర్ హిట్ అందుకున్నారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించినా, మేకర్స్ ఏదో వెలితిగానే ఫీల్ అవుతున్నారు. ఇంతకీ మేకర్స్ ఫీలింగ్‌కు కారణమేంటి.. ఆ విషయంలో వాళ్ల నెక్ట్స్ స్టెప్పేంటి.? అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ఓ మై గాడ్ 2. సెక్స్ ఎడ్యూకేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని సన్నివేశాలు తొలగించటంతో పాటు ఏ సర్టిఫికేట్ జారీ చేయటంతో మేజర్ సెక్షన్ ఆడియన్స్‌ను రీచ్ అవ్వలేకపోయింది. అయితే థియేట్రికల్ రిలీజ్ విషయంలో ఆడియన్స్ మిస్ అయిన ఎలిమెంట్స్‌ను ఓటీటీలో చూపించేందుకు రెడీ అవుతున్నారు ఓ మై గాడ్ 2 మేకర్స్.🎥🎞️