పాయింట్ల పట్టికలో టాప్‌కు కివీస్ - వరల్డ్ కప్‌లో దూసుకుపోతున్న న్యూజిలాండ్
- Suresh D
- Oct 10, 2023
- 1 min read
ప్రపంచ కప్ 2023లో నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ప్రపంచ కప్ 2023లో నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మాత్రమే రెండు మ్యాచ్‌లు ఆడాయి. అందులో న్యూజిలాండ్ జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. కాగా డచ్ జట్టు మాత్రం రెండింటిలోనూ ఓటమిని చవి చూసింది. న్యూజిలాండ్ రెండో మ్యాచ్‌లో గెలిచి నాలుగు పాయింట్లు, +1.958 నెట్ రన్ రేట్ సాధించింది. ఓటమి తర్వాత నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
నెదర్లాండ్స్ ఇప్పటి వరకు పాయింట్ల ఖాతా ఓపెన్ చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా రెండు పాయింట్లు, +2.040 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది. దీని తర్వాత పాకిస్తాన్ రెండు పాయింట్లు, +1.620 నెట్ రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ రెండు పాయింట్లు, +1.438 నెట్ రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక టీమిండియా రెండు పాయింట్లు, +0.883 నెట్ రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అదే సమయంలో ఆరు నుంచి పదో స్థానంలో ఉన్న మొత్తం ఐదు జట్లు ఇంకా తమ విజేత ఖాతాలను తెరవలేదు. ఆస్ట్రేలియా -0.883 నెట్ రన్ రేట్‌తో ఆరో స్థానంలో ఉంది. కంగారూ జట్టు తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ -1.438 నెట్ రన్ రేట్‌తో ఏడో స్థానంలో, నెదర్లాండ్స్ -1.800 నెట్ రన్ రేట్‌తో ఎనిమిదో స్థానంలో, శ్రీలంక -2.040 నెట్ రన్ రేట్‌తో తొమ్మిదో స్థానంలో, ఇంగ్లండ్ జట్టు -2.149 నెట్ రన్ రేట్‌తో 10వ స్థానంలో ఉన్నాయి.