మమ్ముట్టి కథానాయకుడిగా.. భారీ హారర్ థ్రిల్లర్🎥🎞️
- Suresh D
- Aug 18, 2023
- 1 min read
మమ్ముట్టి నటన గురించి .. ఆయనకు గల క్రేజ్ ను గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మలయాళంలోనే కాదు, తెలుగు .. తమిళ భాషల్లోను ఆయనకి గల అభిమానుల సంఖ్య ఎక్కువే. అలాంటి మమ్ముట్టి తన తాజా చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకుని వెళ్లారు .

మమ్ముట్టి నటన గురించి .. ఆయనకు గల క్రేజ్ ను గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మలయాళంలోనే కాదు, తెలుగు .. తమిళ భాషల్లోను ఆయనకి గల అభిమానుల సంఖ్య ఎక్కువే. అలాంటి మమ్ముట్టి తన తాజా చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకుని వెళ్లారు .. ఆ సినిమా పేరే 'భ్రమయుగం'. ఇది హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ. ఈ రోజునే ఈ సినిమా షూటింగును లాంఛనంగా మొదలుపెట్టారు.చక్రవర్తి రామచంద్ర - శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మమ్ముట్టి మాట్లాడుతూ .. " ఇది కేరళ నేపథ్యంలో సాగే కథ .. చీకటి యుగాలకి సంబంధించిన కథ. ఈ తరహా కథను .. పాత్రను నేను ఇంతవరకూ చేయలేదు . దర్శకుడు ఈ కథను చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. తప్పకుండా ఇది ఒక ప్రయోగం అవుతుంది" అని అన్నారు.🎥🎞️