మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూర్చుంటా.. మంత్రి కేటీఆర్ 👨⚖️
- Suresh D
- Aug 9, 2023
- 1 min read
మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 💬 వచ్చే ఎన్నికల్లో.. 🗳️ మీ దయ ఉంటే గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూర్చుంటానంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. 📢 అయితే.. కేటీఆర్.. సడెన్‌గా ఎందుకీ వ్యాఖ్యలు చేశారు?.. అసలెక్కడ చేశారు?.. ఇప్పుడు చూద్దాం.

మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 💬 వచ్చే ఎన్నికల్లో.. 🗳️ మీ దయ ఉంటే గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూర్చుంటానంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. 📢 అయితే.. కేటీఆర్.. సడెన్‌గా ఎందుకీ వ్యాఖ్యలు చేశారు?.. అసలెక్కడ చేశారు?.. ఇప్పుడు చూద్దాం.. 👀 రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సిరిసిల్లలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి.. ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. అటు.. ప్రతిపక్షాల తీరుపైనా విమర్శలు గుప్పించారు. 🗣️🤐 ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 🎙️ ప్రతిపక్ష నాయకులు ఓట్లు అడగడానికి వస్తే.. 👥🗳️ ప్రభుత్వ పథకాలు చెప్పి నిలదీయాలన్నారు. బీసీబంధు లోన్ కాదు.. 🙅♂️ గ్రాంట్ మాత్రమేనని.. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ప్రజలకు వివరించారు. 🗳️ ప్రజలు గమనించాలని సూచించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా… 🙂 ఆ సమయంలోనే.. వచ్చే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసి ప్రకంపనలు రేపారు మంత్రి కేటీఆర్. 💬 వచ్చే ఎన్నికల్లో మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూర్చుంటా.. అన్నారు మంత్రి కేటీఆర్. 👨⚖️ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. 🗳️🔥