వెస్టిండీస్‌తో టీ 20 సిరీస్‌లో సూర్య విధ్వంసం, ఇండియా తొలి విజయం.🏏🇮🇳
- Suresh D
- Aug 9, 2023
- 1 min read
టీమ్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇండియా తొలి విజయం అందుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో పరాజయంతో సిరీస్ 2-0తో వెనుక బడిన ఇండియా మూడవ మ్యాచ్‌లో విజయంతో సిరీస్ 2-1 చేసుకుంది.

టీమ్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇండియా తొలి విజయం అందుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో పరాజయంతో సిరీస్ 2-0తో వెనుక బడిన ఇండియా మూడవ మ్యాచ్‌లో విజయంతో సిరీస్ 2-1 చేసుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ 42 పరుగులు, పావెల్ 40 పరుగుల చేశాడు. 🏏🇮🇳ఇక ఆ తరువాత బరిలో దిగిన టీమ్ ఇండియా బ్యాటర్లు ప్రారంభంలోనే రెచ్చిపోయారు. సూర్య కుమార్ యాదవ్ మరోసారి వినూత్న తరహాలో షాట్లు కొడుతూ 83 పరుగులు చేసి..ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. మరోవైపు తిలక్ వర్మ సైతం 49 పరుగులతో అద్భుతంగా రాణించాడు. మరో 13 బంతులు మిగిలుండగానే 164 పరుగులు చేసి విజయం కైవసం చేసుకుంది. 🏏