మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్..🌟 🙌
- Suresh D
- Oct 25, 2023
- 1 min read
ఎలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన హీరో చిరంజీవి. ఆయన ఎంతో మంది యంగ్ హీరోలకు స్ఫూర్తి. తన నటనతో కోట్లాది మంది ప్రజల మన్ననలు పొందారు మెగాస్టార్. చిరంజీవి ఎందరో నటీనటులకు స్ఫూర్తిగా నిలిచారు. సినిమాల్లో ఉన్నప్పటికీ చిరంజీవి సామాజిక సేవలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎవరికైనా కష్టాలు వచ్చిన వెంటనే ఆదుకోవాలనే దృక్పథంమెగాస్టార్ ది. ఇప్పటికే ఆయన చాలా మందికి సాయం చేశారు.🌟 💫

తాజాగా మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కనిపించారు. ఓ జంటతో చిరంజీవి దిగిన ఫోటో సర్వత్రా వైరల్‌గా మారింది.ఆయన ఎవరు.? చిరంజీవి వారిని ఎందుకు కలిశారు.? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన చిరంజీవికి చిన్ననాటి స్నేహితుడు. మొగలూరులో పుట్టి పెరిగిన చిరంజీవికి చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరు పువ్వాడ రాజు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే ఆసుపత్రికి చేరుకుని తన స్నేహితుడికి సహాయం చేశారు.హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి తన స్నేహితుడికి చికిత్స అందించారు. అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్‌తో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఈ సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు మా అన్న బంగారం, నువ్వే రియల్ హీరో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతకుముందు విలన్ పొన్నం బాలన్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసి రూ.40 లక్షలు సహాయం అందించి. చెన్నై అపోలో ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించారు చిరంజీవి.🌟 💫









































