కనీవినీ ఊహించని రీతిలో జరగబోతున్న చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్🫡🤩
- Avinash Akira

- Aug 20, 2023
- 1 min read
ఈ సారి మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఆకాశాన్ని అంటనున్నాయని మెగా స్టార్ ఫాన్స్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు అన్నారు . దీనికి సంబంధించి ఆయన ఒక నోట్ రిలీజ్ చేసారు .

“ఆగస్టు 22. ప్రతి ఏటా కోట్లాదిమంది మెగాభిమానులు ఎదురుచూసే పండుగ రోజు ఇది. తెలుగు సినిమాకు సంబరం ఈరోజు. తెలుగు సినీ కళామతల్లి పులకరించే రోజు ఇది. ఆరోజే.. శ్రీ కొణిదెల చిరంజీవి గారి జన్మదినం.
ప్రతి ఏటా ఘనంగా.. వినూత్నంగా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే అభిమానులు ఈ ఏడాది కూడా మరింత ఘనంగా.. అంబరాన్నంటే రీతిలో సంబరాలు జరిపేందుకు సిద్ధమయ్యారు.
ఆగస్టు 22 వ తేదీ సాయంత్రం JRC కన్వెన్షన్ హాల్ నందు చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగబోతున్నాయి. చిరంజీవి గారితో పని చేసిన దర్శక దిగ్గజాలు, ఆయన స్పూర్తితో సినిమా రంగంలోకి వచ్చిన నటీనటులు మరియు మెగా హీరోలు & సినీ పరిశ్రమ నుండి ఎందరో నటీ ,నటీమణులు రాబోతున్నారు .

ఆయన్ను అమితంగా ఇష్టపడే నటులు, దైవంగా భావించే అభిమానులు.. ఈ వేదిక నుంచే చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపనున్నారు.
చిరంజీవి గారి సరికొత్త ఫోటోలు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఫోటోలు మీ కోసం చిరు కానుకగా విడుదల చేయబోతున్నాం.
ఈ మెగా సంబరాల్లో అభిమానులు వేలాదిగా పాల్గొని చిరంజీవి గారి పుట్టినరోజు సంబరాలను అంబరాన్నంటేలా ఘనంగా జరపాలని కోరుతున్నాం.”
-R స్వామినాయుడు
అఖిల భారత చిరంజీవి యువత


Comments