నకిలీ ట్రాన్స్‌జెండర్ వేషంలో ఉన్న బెగ్గర్లు.
- Suresh D
- Aug 19, 2023
- 1 min read
తాజాగా అధికారులు నకిలీ ట్రాన్స్‌జెండర్ వేషంలో ఉన్న బెగ్గర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. షాపులు, ట్రాఫిక్ సిగ్నల్స్ హంగామా సృష్టిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా అధికారులు నకిలీ ట్రాన్స్‌జెండర్ వేషంలో ఉన్న బెగ్గర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. షాపులు, ట్రాఫిక్ సిగ్నల్స్ హంగామా సృష్టిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. బెగ్గింగ్ వృత్తిలో ప్రజలను ఇబ్బందిపెడుతున్న బిహార్ గ్యాంగ్‌కు చెందిన 15మంది నకిలీ ట్రాన్స్‌జెండర్స్, 5గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల్లో మొత్తం 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో ముఠాకు చెక్ పెట్టేందుకు పోలీసుల స్పెషల్ యాక్షన్‌ను నిర్వహించారు. ఇక నగరంలో కొందరు మగవారు, ఆడవాళ్లుగా పేరు మార్చుకొని బెగ్గింగ్ దందాకు తెర తీశారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు లాగేస్తున్నారు. అయితా ఇదంతా ఒక ఆర్గనైజ్‌డ్ క్రైమ్‌గా జరుగుతుండడాన్ని గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు.ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో బెగ్గింగ్ మాఫియాపై వరుస దాడులు చేశారు పోలీసులు.









































