సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.😥
- Suresh D
- Aug 9, 2023
- 1 min read
భారతీయ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధీక్(63) గుండెపోటుతో కన్నుమూశారు.

భారతీయ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధీక్(63) గుండెపోటుతో కన్నుమూశారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెల రోజులగా అనారోగ్యం కారణంగా కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సిద్ధీక్. అయితే సోమవారం ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని.. మంగళవారం రాత్రి 9.13 గంటలకు సిద్ధీక్ మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. సిద్ధీక్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.😞