రేవంత్ వ్యాఖ్యల దుమారం.. 🔄
- Suresh D
- Jul 11, 2023
- 1 min read
తానా సభల్లో ఎన్నారైలు అడిగిన ప్రశ్నకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 'రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులే 95% ఉన్నారని ఒక్కో ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక్క గంట చాలు, మొత్తంగా 8 గంటలు ఉచిత విద్యుత్ సరిపోతుంది. కమిషన్ల కోసమే 24 గంటల విద్యుత్ ఇస్తున్నారు' అంటూ అవినీతిపై చెప్పే ప్రయత్నం చేశారు.

తానా సభల్లో ఎన్నారైలు అడిగిన ప్రశ్నకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 'రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులే 95% ఉన్నారని ఒక్కో ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక్క గంట చాలు, మొత్తంగా 8 గంటలు ఉచిత విద్యుత్ సరిపోతుంది. కమిషన్ల కోసమే 24 గంటల విద్యుత్ ఇస్తున్నారు' అంటూ అవినీతిపై చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలే తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారన్ని రేపుతున్నాయి. నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి భిన్నంగా స్పందిస్తున్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని, రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పేరుతో భారీగా అవినీతి జరుగుతుందని రేవంత్ చెప్పే ప్రయత్నం చేసారు. దేశంలో మొదట ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని రైతు డిక్లరేషన్‌లో కూడా పెట్టామని చెబుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బహిరంగంగా మద్దతు ఇస్తున్నా లోలోపల మాత్రం పెద్ద చర్చకు దారితిస్తుంది. రేవంత్ వ్యాఖ్యలు పార్టీకి నష్టం జరిగేలా ఉన్నాయని, పిఏసి లో చర్చించాల్సిందేనని విహెచ్ లాంటి సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఇటు కోమటిరెడ్డి సైతం రేవంత్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని సరిదిద్దే ప్రయత్నం చేశారు. రేవంత్ ఎం మాట్లాడారనే దానిపై నేతలంతా ఆరా దిస్తున్నారు. రేవంత్ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చర్చిస్తున్నారు. 😡