top of page

🌾 జుట్టు బాగా పెరగాలా.. సింపుల్‌గా ఈ ఫుడ్స్ తీసుకుంటే సరి!

🍲 ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి.. 🥩 ప్రోటీన్స్ శరీరానికి అవసరమైన పోషకాల్లో ప్రోటీన్ కూడా ఒకటి. ప్రోటీన్స్ లోపం కారణంగా కూడా జుట్టు రాలుతుంది. ప్రతి రోజు ప్రోటీన్స్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాలడం అనేది తగ్గుతుంది. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 🍽️

🐟 ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్: 🐟 ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గల ఆహారం తీసుకోవడం వల్ల కూడా జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. ముఖ్యంగా సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపల్లో ఈ ఫ్యాటీ యాసిడ్స్ లభ్యమవుతాయి. కాబట్టి తరుచుగా చేపలు తినడం మంచిదె. చర్మం కూడా హెల్దీగా ఉంటుంది.

🍶 గ్రీక్ పెరుగు: 🍶 గ్రీక్ పెరుగను ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యల నుంచి బయట పడొచ్చు. ఇందులో విటమిన్ బి5 ఉంటుంది. ఇది జుట్టును బలంగా చేయడమే కాకుండా స్కాల్ఫ్‌పై రక్త సరఫరాను పెంచుతుంది. దీంతో జుట్టు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. 🥛

🍇 జామ పండ్లు: 🍇 జామ పండ్లు తినడం వల్ల కూడా జుట్టు సమస్యల నుంచి బయట పడొచ్చు. జామ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా విరగకుండా కాపాడుతుంది. అంతే కాకుండా చర్మం కూడా ఫ్రెష్ గా, మెరుస్తూ ఉంటుంది. 🍇

 
 
bottom of page