top of page

📺 మార్కెట్‌లో దుమ్మురేపుతున్న స్మార్ట్‌ టీవీలు..

🖥️ వీయూ 50 అంగుళాలు గ్లో ఎల్‌ఈడీ సిరీస్ 4కే స్మార్ట్ టీవీ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ ప్యానెల్, ఏఐ ప్రాసెసర్‌లు పూర్తి స్థాయి రంగులను పునరుత్పత్తి చేస్తాయి. అలాగే అధునాతన ఏఐ అప్‌స్కేలింగ్ ద్వారా ఓటీటీ వీడియో కంటెంట్‌ను మెరుగుపరుస్తాయి. నాలుగు స్పీకర్లు, ఒక సబ్‌ వూఫర్, 104 వాట్ల మిశ్రమ అవుట్‌పుట్‌తో కూడిన బలమైన ఆడియో సిస్టమ్‌ను కలిగి ఉన్న వీయూ గ్లో ఎల్‌ఈడీ టీవీ మంచి ఆడియో ప్లేబ్యాక్‌ను నిర్ధారిస్తుంది. 🎶

🖥️ ఎంఐ 50 అంగుళాల ఎక్స్‌ 4కే డాల్బీ విజన్ సిరీస్ స్మార్ట్ హెచ్‌డిఆర్ 10. హెచ్‌ఎల్‌జి వంటి అధునాతన సాంకేతికతల ద్వారా వస్తుంది. అందువల్ల స్పష్టమైన రంగులు, డైనమిక్ కాంట్రాస్ట్‌తో ఆకర్షిస్తుంది. డాల్బీ ఆడియో, డీటీఎస్‌ ఎక్స్‌ వంటి అత్యాధునిక ఆడియో టెక్నాలజీల ద్వారా మరింత మెరుగుపరచబడిన శక్తివంతమైన 30 వాట్స్‌ స్పీకర్‌ మంచి సినిమాటెక్‌ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.

🖥️ ఏసర్‌ 50 అంగుళాల అధునాతన ఐ సిరీస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ గూగుల్‌ టీవీ. గూగుల్‌ టీవీ ప్రతి యూజర్‌కు వ్యక్తిగతీకరించిన ప్రొఫైల్‌లను అందిస్తుంది. డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్‌తో థియేటర్-నాణ్యత ఆడియో ద్వారా ఈ టీవీ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. ఫ్రేమ్‌లెస్ డిజైన్‌తో ఈ గూగుల్‌ టీవీ స్క్రీన్‌ స్థలాన్ని గరిష్టం చేస్తుంది. అలాగే జోడించిన చక్కదనం కోసం సొగసైన మెటల్ బాడీ ఈ టీవీ ప్రత్యేకతలుగా ఉంటున్నాయి. 📺

 
 
bottom of page