top of page

🔄 ఎట్టకేలకు వచ్చేసిన టెక్నో స్పార్క్‌ 20.. రూ. 10వేలలో ఊహకందని ఫీచర్స్‌

📱 టెక్నో స్పార్క్‌ 20 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 720×1612 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 📏

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ జీ85 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 📲 ఇక ఈ ఫోన్‌లో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ Hios13 ఇంటర్‌ఫేస్‌ను అందించారు.

📸 ఇక ఈ ఫోన్‌ కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 📷 సెల్ఫ కెమెరాలు క్లారిటీతో వచ్చే ఉద్దేశంతో ఈ ఫోన్‌లో ఫ్రంట్‌ కెమెరాకు ప్రాధాన్యత ఇచ్చారు. 🌈 ఇక ఇందులో ఐపీ53 డస్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెన్స్‌ను ఇచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ టెక్నాలజీతో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 🔋 ఇక ఇందులో జీ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌ను ప్రత్యేకంగా అందించారు.

📏 ఇక ఈ ఫోన్‌ డైమెన్షన్స్‌ విషయానికొస్తే 169.69 ఎమ్‌ఎమ్‌ హైట్‌, 75.6 ఎమ్‌ఎమ్‌ విడ్త్‌, 8.45 ఎమ్‌ఎమ్‌ థిక్‌నెస్‌తో డిజైన్‌ చేశారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ గ్రావిటీ బ్లాక్‌, సైబర్‌ వైట్‌, నియాన్‌ గోల్డ్‌, మ్యాజిక్‌ స్కిన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. 🎨 డ్యూయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందించారు. డిజిటల్‌ జూమ్‌, ఆటో ఫ్లాష్‌, ఫేస్‌ డిటెక్షన్‌ వంటి ఫీచర్లను అందించారు. 📸

 
 
bottom of page