top of page

రీఛార్జ్ ప్లాన్లలో ఏది బెటరో తెలుసా...📱

ముఖ్యంగా చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.300లోపు రీఛార్జ్ ప్లాన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాదు హై స్పీడ్ డేటా, SMS, అన్‌లిమిటెడ్ కాల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ అత్యంత అవసరం. అందులోనూ డేటా బెనిఫిట్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉపయోగమని కస్టమర్లు ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.300లోపు రీఛార్జ్ ప్లాన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాదు హై స్పీడ్ డేటా, SMS, అన్‌లిమిటెడ్ కాల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్, జియో పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ సందర్భంగా Jio Vs Airtel కంపెనీల్లో ఏ ప్లాన్ మరింత ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి...

రిలయన్స్ జియో రూ.269 ప్లాన్.. 📱

రిలయన్స్ జియో నుంచి రూ.269తో రీఛార్జ్ చేసుకుంటే జియో సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. ఈ రీఛార్జ్ వల్ల మొత్తం 42GB డేటా అందుతుంది. అంటే రోజుకు 1.5GB లభించనుంది. ఒకవేళ డైలీ లిమిట్ దాటితే నెట్ స్పీడ్ 64Kbpsకి తగ్గిపోతుంది. అంతేకాదు జియో క్లౌడ్, జియో టివి సబ్‌స్క్రిప్షన్లు కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ.265 రీఛార్జ్ ప్లాన్.. 📱

జియో నుంచి పోటీని తట్టుకోవడానికి ఎయిర్‌టెల్ కూడా తక్కువ ధరకే గొప్ప రీఛార్జ్ ప్లాన్ రూ.265ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో భాగంగా 1GB డేటా, రోజుకు 100 SMSలు, అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా అయిపోయిన తర్వాత నెట్ స్పీడ్ 64kbpsకి పడిపోతుంది. ఈ ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి hellotune, wynk music సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభించనున్నాయి. జియోతో పోలిస్తే ఈ ప్లాన్లో కొంత తక్కువగా ఉంటుంది.

 
 
bottom of page