top of page

రైల్వేస్టేషన్లో హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి... 🚄💨

అప్పుడు మీ నెట్ స్పీడ్ 34mbpsకి పెరిగి 5G నెట్ లభిస్తుంది. దీని వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే ఉంటుంది.అదే విధంగా రూ.75 చెల్లిస్తే, 34Mbps వేగంతో 60GB డేటా లభించే మరో ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.

Railtel వెబ్‌సైట్లో ఇచ్చిన సమాచారం మేరకు, రోజుకు 30 నిమిషాలు ఉచితంగా 1mbps స్పీడ్ ఉంటుంది. అయితే దీని కంటే ఎక్కువ హై స్పీడ్ నెట్ కావాలనుకునే వారు రూ.10తో ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు మీ నెట్ స్పీడ్ 34mbpsకి పెరిగి 5G నెట్ లభిస్తుంది. దీని వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే ఉంటుంది.అదే విధంగా రూ.75 చెల్లిస్తే, 34Mbps వేగంతో 60GB డేటా లభించే మరో ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. దీని వ్యాలిడిటీ 30 రోజుల పాటు ఉంటుంది. ఈ ప్లాన్ కావాల్సిన వారు ఆన్‌‌లైన్ వాలెట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్లో రైట్ సైడ్ టాప్‌లో కనిపించే వైఫై ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దీన్ని ఆన్ చేసి, రైల్‌వైర్ వైఫై నెట్వర్క్‌ని సెలెక్ట్ చేసుకోండి.

మొబైల్ బ్రౌజర్‌తో railwire.co.in వెబ్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.మీ హై స్పీడ్ వైఫై పాస్‌వర్డ్ మీ ఫోన్‌కి OTP రూపంలో వస్తుంది.

దీని సాయంతో మీరు 30 నిమిషాల వరకు ఫ్రీ ఇంటర్నెట్ వాడొచ్చు. అయితే ఈ ఫ్రీ వైఫై కదిలే రైలులో వాడలేమన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సర్వీసు కేవలం స్టేషన్ ప్లాట్‌ఫారమ్ లోపల మాత్రమే రైల్‌టెల్ లేదా రైల్‌వైర్‌గా అందుబాటులో ఉంటుంది. 🚆✨

 
 
bottom of page