top of page

ఛీ..ఛీ.. మద్యం మత్తులో హాస్పిటల్‌లో వైద్యుడు పాడుపని 😖

మద్యం మత్తులో ఓ వైద్యుడు వింతగా ప్రవర్తించాడు. బట్టలు విప్పి నగ్నంగా హాస్పిటల్ అంతా తిరిగాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంబాజీనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. సంబాజీనగర్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న 45 ఏళ్ల డాక్టర్‌ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల ఫుల్లుగా మద్యం సేవించి ఆస్పత్రికి వచ్చాడు. ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్న అతడు.. టాయిలెట్‌కి వెళ్లి ఒంటిమీద బట్టలన్నీ విప్పేసి బయటకొచ్చాడు. అంతేకాదు, పైన ఉన్న యాప్రాన్‌ని తీసేసి అటూ ఇటూ దులిపాడు ఏం చేస్తున్నాడో తనకే తెలియనంతగా మత్తులో చాలా సేపు కలియ తిరిగాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, కచ్చితంగా ఆ వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ దయానంద్ మోతీపవ్లే పేర్కొన్నారు. సదరు వైద్యుడు డ్రగ్స్‌కీ బానిస అయినట్టు తెలుస్తోంది. ఆ మత్తులోనే ఇలా చేసి ఉంటాడని అధికారులు చెబుతున్నారు. తప్పుచేసినట్టు నిర్దారణ అయితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. 😳



 
 
bottom of page