రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 🔄👤🔍
- Shiva YT
- Jan 21, 2024
- 1 min read
వేంనరేందర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ఈయనే కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సలహాదారు పదవి దక్కిందంటున్నాయి పార్టీ వర్గాలు.
నిజామాబాద్‌కి చెందిన మైనార్టీ నేత షబ్బీర్ అలీని కూడా సలహాదారుగా నియమించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ పోటీ చేయాల్సి ఉన్నా.. రేవంత్ కోసం నిజామాబాద్ అర్బన్‌కి మారారు. ఓటమి పాలయ్యారు. ఫలితాల తర్వాత షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ కానీ మరేదైనా పదవి కానీ వస్తుందనే మాట బలంగానే వినిపించింది. ఇప్పుడు ఆయన్ను సలహాదారుగా నియమితులయ్యారు. 🎯👥
హర్కర వేణుగోపాల్ పార్టీలో కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. AICC సభ్యుడిగా, TPCC ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రొటోకాల్ కమిటీ ఛైర్మన్‌గానూ ఉన్న వేణుగోపాల్‌కు రాహుల్ సహా పార్టీ సీనియర్లతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా ఇప్పుడు సలహాదారుగా నియమితులయ్యారు. 🔄🤝💼