top of page

సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..🗳️👤👥

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు.

వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ రానుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా అదే టైం లో ఎన్నికలు వచ్చాయని గుర్తు చేశారు. మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రులే జైలుకు వెళ్ళారని విమర్శించారు. గత ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వం అని ఆరోపించారు. మోడీ పాలనలో మతకలహాలు, బాంబు పేలుళ్ళు లేవన్నారు. గందరగోళ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లేదని విమర్శించారు. జీతాలు ఇవ్వలేని పరిస్తితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పడిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా హామీలు అమలు చేస్తుందనేది చెప్పడం లేదన్నారు. 🇮🇳🗣️🔄

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page