6 నెలల్లోనే 51 కిలోలు తగ్గాడు.. అందుకోసం ఏం చేశాడంటే.. 🏋️♂️
- Suresh D
- Mar 11, 2024
- 2 min read
సాహిల్ ముందు రోజుల్లో ఎక్కువగా కూల్‌డ్రింక్స్ తీసుకునేవాడు. దీంతో పాటు బర్గర్స్, చైనీస్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ ఇలా ఇష్టమొచ్చినట్లుగా జంక్ ఫుడ్ తీసుకునేవాడు. దీంతో పాటు యాక్టివ్‌గా ఉండేవాడు కాదు. కనీస వర్కౌట్ చేయలేదు. దీంతో బరువు విపరీతంగా పెరిగాడు.
నేటి బిజీ లైఫ్‌లో ఎవరు కూడా వారి లైఫ్‌స్టైల్, బాడీపై శ్రద్ధ పెట్టడం లేదు. కూర్చుని జాబ్ చేసేవారికి ఫిజికల్ యాక్టివిటీ అంతగా ఉండదు. అదే విధంగా అన్ హెల్దీ ఫుడ్. దీని వల్ల చాలా మంది వెయిట్ పెరిగిపోతున్నారు. దీనిని తగ్గించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఈ నేపథ్యంలోనే సాహిల్ కుమార్ జైన్ అనే బిజినెస్ మ్యాన్ కేవలం ఆరు నెలలోనే బరువు తగ్గి హెల్దీగా మారాడు. సాహిల్ ముందు రోజుల్లో ఎక్కువగా కూల్‌డ్రింక్స్ తీసుకునేవాడు. దీంతో పాటు బర్గర్స్, చైనీస్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ ఇలా ఇష్టమొచ్చినట్లుగా జంక్ ఫుడ్ తీసుకునేవాడు. దీంతో పాటు యాక్టివ్‌గా ఉండేవాడు కాదు. కనీస వర్కౌట్ చేయలేదు. దీంతో బరువు విపరీతంగా పెరిగాడు. 2018 జూన్‌లో బరువు తగ్గాలని నిర్ణయించుకున్న సాహిల్.. మొదట స్విమ్మింగ్‌లో చేరాడు. అక్కడ కేవలం ఒక్క నెలలోనే 8 కేజీల వరకూ బరువు తగ్గి హెల్దీగా మారాడు. ఇదే ఇన్సిపిరేషన్‌గా వర్కౌట్ డోస్ పెంచాడు. తన రోజువారీ పనులు చేస్తూనే వర్కౌట్ ఎక్కువగా చేసేవాడు. ఉదయం 8 గంటలకి పోహా, ఉడికించిన కూరగాయలు, 80 గ్రాముల పనీర్. లో ఫ్యాట్ మిల్క్‌లో బెల్లం కలిపి తీసుకోవడం.
11.30 గంటలకి ఓ కప్పు గ్రీన్ టీ.. 🍵
మధ్యాహ్నం లంచ్‌లో ఉడికించిన క్యాబేజీ, టమాట, పచ్చి ఉల్లిపాయలు, రాజ్మా, నల్ల శనగలు ఉండేవి. 🥦
సాయంత్రం స్నాక్స్ టైమ్‌లో బెల్లం కలిపిన లో ఫ్యాట్ మిల్క్, రెండు బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ పీనట్ బటర్. ఇంకా ఆకలిగా ఉంటే ఆపిల్. 🥛🍎
రాత్రి 7.30కి ఓ కప్పు గ్రీన్ టీ. 🍵
డిన్నర్‌లో 100 గ్రాముల పనీర్‌తో పాటు సలాడ్ తీసుకునేవాడు. ఎలాంటి స్వీట్స్ తీసుకోకుండా కఠినమైన డైట్ ఫాలో అయ్యాడు. 🥗
రాత్రి పడుకునే ముందు కొద్దిగా బెల్లం కలిపిన లో ఫ్యాట్ మిల్క్. 10 నానబెట్టిన బాదం పప్పులు. రోజు ఓ గంట స్విమ్మింగ్‌తో కేలరీలు బర్న్ అవుతాయి. దీన వల్ల బాడీ మొత్తానికీ వర్కౌట్ చేసిన లాభం ఉంటుంది. దీనతో పాటు 12 కి. మీ జిమ్‌లోనే రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. కొన్ని నెలల పాటు ఇలానే చేయడంతో తన బరువు 125 కిలోల నుంచి 75 కిలోల వరకూ తెచ్చుకున్నాడు. అంతే మొత్తంగా 51 కిలోల వరకూ తాను తగ్గాడు. ఇదంతా కేవలం 6 నెలల్లోనే జరిగింది. హెల్దీ లైఫ్‌స్టైల్ కారణంగానే అని సాహిల్ చెబుతున్నాడు. 💪🍎









































