తెలంగాణాలో నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 🙋♀️🚌
- Suresh D
- Dec 9, 2023
- 1 min read
ఇవాల్టి నుంచి తెలంగాణలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. 6 గ్యారంటీల్లో ఒకటైన ఈ మహాలక్ష్మి స్కీమ్‌ను ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా ఇవాల్టి నుంచి తెలంగాణలో మహిళలు ఉచితంగా టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించొచ్చు.
ఇవాల్టి నుంచి తెలంగాణలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. 6 గ్యారంటీల్లో ఒకటైన ఈ మహాలక్ష్మి స్కీమ్‌ను ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా ఇవాల్టి నుంచి తెలంగాణలో మహిళలు ఉచితంగా టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించొచ్చు.🌐👩👧👧 శనివారం (డిసెంబర్ 9) మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి, ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతకుమారి, ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ వాణీ ప్రసాద్, ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. దాని కోసం ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. మహిళలతోపాటు బాలికలు, ట్రాన్స్‌జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. అయితే ఒక వారం పాటు ఎలాంటి ఐడెంటిటీ కార్డు అవసరం లేదన్నారు సజ్జనార్. ఆ తర్వాత మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ జారీ కోసం సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తోంది టీఎస్ ఆర్టీసీ.
తెలంగాణ పరిధిలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. తెలంగాణ పరిధి దాటి ప్రయాణిస్తే మాత్రం టారిఫ్ ప్రకారం చార్జ్ వసూలు చేస్తారు. ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి తిరిగి చెల్లిస్తారు. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీకి రోజుకు 14 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోందన్నారు సజ్జనార్. మహిళలకు ఉచిత ప్రయాణంతో 50 శాతం ఆదాయం తగ్గుతుందన్నారు. తగ్గే ఆదాయం విషయంలో ప్రభుత్వ సహాయంకై విజ్ఞప్తి చేశామంటున్నారు ఆయన.🙋♀️🚌